క్లబ్‌లో నలుగురిని బంధించిన సాయుధుడు

నెదర్లాండ్స్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అమ్‌స్టర్‌డామ్‌కు సమీపంలోని ఇడె పట్టణంలో ఉన్న నైట్‌ క్లబ్‌లో నలుగురు యువకులను ఓ సాయుధుడు బంధించాడు.

Published : 31 Mar 2024 04:27 IST

నిందితుడిని అరెస్టు చేసిన నెదర్లాండ్స్‌ పోలీసులు

ఇడె: నెదర్లాండ్స్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అమ్‌స్టర్‌డామ్‌కు సమీపంలోని ఇడె పట్టణంలో ఉన్న నైట్‌ క్లబ్‌లో నలుగురు యువకులను ఓ సాయుధుడు బంధించాడు. ఆయుధాలు, పేలుడు పదార్థాలతో వచ్చిన ఓ వ్యక్తి వారిని శుక్రవారం ఒక క్లబ్‌లో బంధించినట్లు పోలీసులు వెల్లడించారు. రంగంలోకి దిగిన భద్రతాదళాలు గంటల తరబడి ఉద్రిక్తతల అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు శనివారం ఎక్స్‌ ద్వారా పోలీసులు తెలిపారు. బందీలుగా ఉన్న వారందరినీ విడిపించినట్లు తెలిపారు. అంతకుముందు క్లబ్‌ పరిసరాల్లో రిమోట్‌ కంట్రోల్డ్‌ రోబో, పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే బలగాలను మోహరించారు. దగ్గర్లో ఉన్న 150 ఇళ్లను ఖాళీ చేయించారు. ఎవరూ ఉద్రిక్త ప్రాంతం వైపు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. క్లబ్‌ నుంచి బయటకు వచ్చిన నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన వెనుక ఉగ్ర కోణం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆనవాలు లేవని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని