ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న దాడులు

ఉక్రెయిన్‌లోని విద్యుత్కేంద్రాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. లవీవ్‌ ప్రాంతంలో మాస్కో ప్రయోగించిన క్రూజ్‌ క్షిపణి ఒకరి ప్రాణాలను బలిగొంది.

Published : 01 Apr 2024 05:12 IST

ఇద్దరి మృతి

కీవ్‌: ఉక్రెయిన్‌లోని విద్యుత్కేంద్రాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. లవీవ్‌ ప్రాంతంలో మాస్కో ప్రయోగించిన క్రూజ్‌ క్షిపణి ఒకరి ప్రాణాలను బలిగొంది. ఈశాన్య ఉక్రెయిన్‌లో జరిగిన దాడిలో మరో వ్యక్తి మృతి చెందారు. విద్యుత్కేంద్రాలు పనిచేయకపోవడంతో ఒడెసాలోని చాలా ప్రాంతాల్లో అంధకారం అలముకుంది. లక్షా 70 వేల గృహాలు చీకట్లో మగ్గుతున్నాయి. రష్యా ప్రయోగించిన 14 క్రూజ్‌ క్షిపణుల్లో తొమ్మిదింటిని, 11 డ్రోన్లలో తొమ్మిదింటిని కూల్చివేశామని ఉక్రెయిన్‌ వాయుసేన తెలిపింది. మరోవైపు వందలాది సైనిక వాహనాలను వచ్చే ఏడాది ఉక్రెయిన్‌కు అందజేస్తామని ఫ్రాన్స్‌ తెలిపింది. సాయుధ బలగాలను త్వరగా తరలించేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని