అమెరికాలో షాపింగ్‌మాల్‌ వెలుపల కాల్పులు

అమెరికాలోని ఇండియానాపొలిస్‌లో ఓ షాపింగ్‌మాల్‌ వెలుపల శనివారం అర్ధరాత్రి వేళ కొందరు జరిపిన తుపాకీ కాల్పుల్లో ఏడుగురు గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

Published : 01 Apr 2024 05:12 IST

ఏడుగురికి గాయాలు

ఇండియానాపొలిస్‌: అమెరికాలోని ఇండియానాపొలిస్‌లో ఓ షాపింగ్‌మాల్‌ వెలుపల శనివారం అర్ధరాత్రి వేళ కొందరు జరిపిన తుపాకీ కాల్పుల్లో ఏడుగురు గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. క్షతగాత్రులంతా 12-17 ఏళ్ల వయసువారని పేర్కొన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. మిగతావారి పరిస్థితి నిలకడగా ఉందని, ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని