సునాక్‌కు ఘోర పరాభవం తప్పదు

ఈ ఏడాదిలో జరగనున్న బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కన్జర్వేటివ్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలబోతోందని సివిల్‌ సొసైటీ ప్రచార సంస్థ విడుదల చేసిన మెగా పోల్‌ అంచనా వేసింది.

Published : 01 Apr 2024 05:13 IST

బెస్ట్‌ ఫర్‌ బ్రిటన్‌ మెగా పోల్‌ అంచనా

లండన్‌: ఈ ఏడాదిలో జరగనున్న బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కన్జర్వేటివ్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలబోతోందని సివిల్‌ సొసైటీ ప్రచార సంస్థ విడుదల చేసిన మెగా పోల్‌ అంచనా వేసింది. అలాగే నార్త్‌ యార్క్‌షైర్‌లో ప్రధాని రిషి సునాక్‌కు కూడా గట్టి పోటీ తప్పదని పేర్కొంది. ఈ పోల్‌లో 15,029 మంది పాల్గొనగా.. 45 శాతం ఓట్‌ షేర్‌తో కన్జర్వేటివ్‌ పార్టీపై ప్రతిపక్ష లేబర్‌ పార్టీ 19 పాయింట్ల ఆధిక్యంలో ఉందని, ఆ పార్టీకి 286 సీట్ల మెజారిటీ వస్తుందని తేలింది. ‘‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అధికార పార్టీ ఎంపీలు 250 మంది ఓడిపోతారు. లేబర్‌ పార్టీ 468 సీట్లు గెలుస్తుంది’’ అని సర్వే సంస్థ విశ్లేషించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని