అమెరికాలో మరోసారి.. వంతెనను ఢీకొన్న పెద్ద పడవ

అమెరికాలో వారం రోజుల కిందట ఆరుగురి ప్రాణాలు బలిగొన్న బాల్టిమోర్‌ వంతెన ప్రమాదాన్ని మరిచిపోకముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకొంది.

Updated : 01 Apr 2024 05:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలో వారం రోజుల కిందట ఆరుగురి ప్రాణాలు బలిగొన్న బాల్టిమోర్‌ వంతెన ప్రమాదాన్ని మరిచిపోకముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకొంది. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఓక్లహామాలోని ఆర్కన్సాస్‌ నదిపై ఉన్న వంతెనను ఓ బార్జ్‌ (భారీ వాహనాలను తరలించే పడవ) ఢీకొంది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన స్థానిక పెట్రోలింగ్‌ బృందాలు సాల్లిసా హైవే దక్షిణ భాగాన్ని మూసివేసి, రాకపోకలను వేరే దారిలోకి మళ్లించాయి. ఈ ప్రమాదంలో బార్జ్‌ దెబ్బతినగా.. వంతెన పరిస్థితిని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలు తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని