గాజా తాత్కాలిక ఆసుపత్రిపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి

మధ్య గాజాలో కిక్కిరిసిపోయిన ఓ ఆసుపత్రి పెరడులో తాత్కాలిక శిబిరంపై ఇజ్రాయెల్‌ దళాలు ఆదివారం వైమానిక దాడి నిర్వహించాయి.

Updated : 01 Apr 2024 05:18 IST

డెయిర్‌ అల్‌-బలా: మధ్య గాజాలో కిక్కిరిసిపోయిన ఓ ఆసుపత్రి పెరడులో తాత్కాలిక శిబిరంపై ఇజ్రాయెల్‌ దళాలు ఆదివారం వైమానిక దాడి నిర్వహించాయి. ఈ ఘటనలో ఇద్దరు పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. పాత్రికేయులతో సహా 15 మంది గాయపడ్డారు. యుద్ధ కల్లోలిత ప్రాంతాల నుంచి వచ్చిన వందల మంది ప్రజలు ఈ ఆసుపత్రిలో ఆశ్రయం పొందతున్నారు. దాడితో మహిళలు, పిల్లలు చెల్లాచెదురై పెద్దపెట్టున రోదించారు. ఆసుపత్రి సేవలకు ఎలాంటి ఆటంకం కలగలేదని, ఇస్లామిక్‌ జిహాద్‌ ‘ఉగ్రవాదుల శిబిర కమాండ్‌ కేంద్రం’పైనే తాము దాడి చేశామని ఇజ్రాయెల్‌ సైన్యం స్పష్టంచేసింది. అక్కడ భారీగా ఆయుధాలను గుర్తించినట్లు తెలిపింది.

నెతన్యాహుకు శస్త్రచికిత్స: ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకు ఆదివారం హెర్నియా శస్త్రచికిత్స నిర్వహించారు. మత్తు ఇచ్చి శస్త్రచికిత్స చేసిన సమయంలో ఉప ప్రధాని యారివ్‌ లెవిన్‌ తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని