ఇదీ ‘క్లిక్‌ హియర్‌’ ట్రెండ్‌ కథ!

‘క్లిక్‌ హియర్‌ ట్రెండ్‌’.. సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో శనివారం నుంచి విస్తృతంగా కనిపిస్తోంది. ‘క్లిక్‌ హియర్‌’ అని బోల్డ్‌ బ్లాక్‌ ఫాంట్‌లో రాసిన అక్షరాలు.. దాని కింద ఎడమవైపునకు చూపిస్తున్న బాణం గుర్తు చిత్రాలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Updated : 01 Apr 2024 05:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘క్లిక్‌ హియర్‌ ట్రెండ్‌’.. సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో శనివారం నుంచి విస్తృతంగా కనిపిస్తోంది. ‘క్లిక్‌ హియర్‌’ అని బోల్డ్‌ బ్లాక్‌ ఫాంట్‌లో రాసిన అక్షరాలు.. దాని కింద ఎడమవైపునకు చూపిస్తున్న బాణం గుర్తు చిత్రాలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. సాధారణంగా ఈ బాణం గుర్తు ఆల్ట్‌ టెక్ట్స్‌ లేదా ఆల్టర్‌నేటివ్‌ టెక్ట్స్‌ ఫీచర్‌ను చూపిస్తోంది. ఫొటోలు పోస్టు చేసే వినియోగదారులు ఆల్ట్‌ను క్లిక్‌ చేసి తమ సందేశాన్ని జత చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కేవలం ఫొటో పోస్టులకు మాత్రమే పనిచేస్తుంది. వీడియో పోస్టులకు దీన్ని ఉపయోగించలేం. 2016లోనే ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌ను వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వినియోగించేవారు. వీటిల్లో రాజకీయ ప్రకటనలు, సామాజిక అంశాలు వంటివి ఉంటాయి. ప్రస్తుతం ఆప్‌, భాజపా వంటి పార్టీల నేతలు ఈ ట్రెండింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. తమ రాజకీయ సందేశాలను వీటిల్లో ఉంచి ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. భాజపా తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేసి క్లిక్‌ హియర్‌లో ‘ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌’ అనే సందేశం ఉంచగా.. రామ్‌లీలా మైదానంలో ఆప్‌ చేపట్టిన మెగార్యాలీ ప్రచారంలో దీనిని వాడుకుంది. ఆన్‌లైన్‌ వీక్షకులతో నిరంతరం టచ్‌లో ఉండటం కోసం ఈ మార్గాలను వినియోగిస్తుంటారు. ఇక్కడి అక్షరాలను టెక్ట్స్‌ టు స్పీచ్‌, బ్రెయిలీతో చదివే అవకాశం ఉంది. దాదాపు 420 క్యారెక్టర్లను దీనిలో రాయవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని