పాక్‌ అధికారిక కార్యక్రమాల్లో ఎర్ర తివాచీల నిషేధం

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్‌లో అనవసర ఖర్చులను తగ్గించడంలో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎర్ర తివాచీల వినియోగాన్ని నిషేధిస్తూ ఆ దేశ ప్రధాని హెహబాజ్‌ షరీఫ్‌ నిర్ణయం తీసుకున్నారు.

Updated : 01 Apr 2024 05:37 IST

వ్యయ నియంత్రణలో భాగంగా ప్రధాని షెహబాజ్‌ నిర్ణయం

ఇస్లామాబాద్‌: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్‌లో అనవసర ఖర్చులను తగ్గించడంలో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎర్ర తివాచీల వినియోగాన్ని నిషేధిస్తూ ఆ దేశ ప్రధాని హెహబాజ్‌ షరీఫ్‌ నిర్ణయం తీసుకున్నారు. వాటిని దౌత్యపరమైన కార్యక్రమాలకు మాత్రమే పరిమితం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు, సీనియర్‌ అధికారులకు ఎర్ర తివాచీలను వినియోగించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గత వారం ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, కేబినెట్‌ సభ్యులు తమ జీతాలు, ప్రోత్సాహకాలను స్వచ్ఛందంగా వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. పొదుపు చర్యలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని షెహబాజ్‌ గత నెలలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని