హూతీ డ్రోన్ల కూల్చివేత

హూతీ తిరుగుబాటుదారుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ఒక డ్రోన్‌ను, ఎర్ర సముద్రంలో కీలక నౌకాయాన మార్గంలో మరో డ్రోన్‌ను కూల్చివేసినట్లు అమెరికా సైన్యం తెలిపింది.

Published : 02 Apr 2024 04:52 IST

కైరో: హూతీ తిరుగుబాటుదారుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ఒక డ్రోన్‌ను, ఎర్ర సముద్రంలో కీలక నౌకాయాన మార్గంలో మరో డ్రోన్‌ను కూల్చివేసినట్లు అమెరికా సైన్యం తెలిపింది. ఇరాన్‌ మద్దతు ఉన్న తిరుగుబాటుదారులకు, అమెరికాకు మధ్య నెలలతరబడి నెలకొన్న ఉద్రిక్తతల్లో ఇది తాజా పరిణామం. తమ బలగాల పరిరక్షణకు, నౌకాయాన స్వేచ్ఛకు ఈ చర్య చేపట్టినట్లు సైన్యం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని