ఇమ్రాన్‌ దంపతులకు భారీ ఊరట

వివిధ కేసుల్లో జైలు జీవితం గడుపుతున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట లభించింది.

Published : 02 Apr 2024 04:52 IST

‘తోషాఖానా’ కేసులో 14 ఏళ్ల జైలుశిక్ష నిలుపుదల

ఇస్లామాబాద్‌: వివిధ కేసుల్లో జైలు జీవితం గడుపుతున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట లభించింది. తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్‌తో పాటు ఆయన భార్య బుష్రా బీబీకి కింద కోర్టు విధించిన చెరో 14 ఏళ్ల జైలుశిక్షలను నిలుపుదల చేస్తూ సోమవారం ఇస్లామాబాద్‌ హైకోర్టు తాత్కాలిక బెయిల్‌ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా వీరిద్దరూ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదు. ‘ఇద్దత్‌’ కేసులో వీరికి చెరో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. గూఢచర్య ఆరోపణల కేసులోనూ ఇమ్రాన్‌ పదేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని