గాజా ఆసుపత్రి నుంచి వైదొలగిన ఇజ్రాయెల్‌

రెండు వారాలపాటు దాడుల తర్వాత గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి నుంచి ఇజ్రాయెల్‌ సైన్యం సోమవారం వైదొలగింది.

Updated : 02 Apr 2024 05:50 IST

200 మందిని హతమార్చినట్లు వెల్లడి

డెయిర్‌ అల్‌-బలా: రెండు వారాలపాటు దాడుల తర్వాత గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి నుంచి ఇజ్రాయెల్‌ సైన్యం సోమవారం వైదొలగింది. అక్కడ మొత్తం 200 మంది ఉగ్రవాదులను హతమార్చి, కొన్ని వందలమందిని నిర్బంధించినట్లు ప్రకటించింది. ఆరు నెలల యుద్ధంలో ఇదొక భారీ విజయమని అభివర్ణించింది. పెద్దఎత్తున విధ్వంసాన్ని ఇజ్రాయెల్‌ దళాలు మిగిల్చాయని, అనేక మృతదేహాలు అక్కడే పడిఉన్నాయని పాలస్తీనా వాసులు చెబుతున్నారు. గాజాలో పెద్దఎత్తున బందీలుగా ఉన్నవారిని ఇళ్లకు తీసుకువచ్చేందుకు ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు మరిన్ని చర్యలు చేపట్టాలంటూ ఇజ్రాయెల్‌లో భారీగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నవేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆసుపత్రిలో కనీసం 21 మంది రోగులు చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఘెబ్రియేసస్‌ తెలిపారు. శిథిలాల్లో తమ ఏడుగురి బంధువుల మృతదేహాలు దొరికాయని, వర్ణించడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయని స్థానికుడొకరు తెలిపారు. ఇజ్రాయెల్‌లో అల్‌జజీరా ఛానల్‌ ప్రసారం కాకుండా స్తంభింపజేస్తున్నట్లు నెతన్యాహు ప్రకటించారు. దీనిని ఉగ్రఛానల్‌గా అభివర్ణించారు. ఛానల్‌పై చర్యకు పార్లమెంటు ఆమోదం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని