మోదీ విజయం కోసం అమెరికాలో ర్యాలీలు

భారత్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 400కు పైగా సీట్లు ఇచ్చి నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలంటూ భారతీయ ఓటర్లను అభ్యర్థిస్తూ అమెరికాలోని 20 నగరాల్లో ప్రవాస భారతీయులు ర్యాలీలు జరిపారు.

Published : 02 Apr 2024 04:53 IST

వాషింగ్టన్‌: భారత్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 400కు పైగా సీట్లు ఇచ్చి నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలంటూ భారతీయ ఓటర్లను అభ్యర్థిస్తూ అమెరికాలోని 20 నగరాల్లో ప్రవాస భారతీయులు ర్యాలీలు జరిపారు. తాము మోదీ 3.0 సర్కారును కోరుకుంటున్నామని విదేశాల్లోని భాజపా మిత్రుల సంఘం (ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ బీజేపీ) అధ్యక్షుడు అడపా ప్రసాద్‌ పేర్కొన్నారు. మోదీ విజయం కోసం అమెరికా నలువైపులా 20 నగరాల్లో కార్ల ర్యాలీలు నిర్వహించామని ఈ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి వాసుదేవ్‌ పటేల్‌ తెలిపారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ర్యాలీలు జరిగాయి. న్యూజెర్సీ నగర ర్యాలీలో 200 కార్లు పాల్గొన్నాయి. సిలికాన్‌ వ్యాలీ, శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో 300 మంది 200 కార్లలో ఊరేగింపుగా మోదీ విజయం కోసం సందడి చేశారు. అట్లాంటా నగరంలో 150 కార్ల ర్యాలీ జరిగింది. ఆస్టిన్‌, డాలస్‌, షికాగో,  డెట్రాయిట్‌ నగరాల్లో కూడా భాజపా, అమెరికా జాతీయ జెండాలతో కారు ర్యాలీలు జరిపారు. అబ్‌ కీ బార్‌ 400 పార్‌, మోదీ 3.0 అని నినాదాలు రాసిన బ్యానర్లతో కోలాహలంగా ప్రదర్శన నిర్వహించారు. మోదీ మూడోసారి గెలవడం భారతదేశానికే కాకుండా ప్రపంచంలో శాంతిసుస్థిరతలకు అత్యంత ఆవశ్యకమంటూ అమెరికన్‌ సిక్కులు వాషింగ్టన్‌ డీసీలో కార్ల ర్యాలీ జరపడం విశేషం. వారు మొదట గురుద్వారాలకు వెళ్లి అక్కడి నుంచి ర్యాలీ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని