ఇరాన్‌ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్‌ దాడి

సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయ కాన్సులర్‌ విభాగంపై ఇజ్రాయెల్‌ సోమవారం గగనతల దాడికి దిగింది.

Published : 02 Apr 2024 04:55 IST

సైనిక సలహాదారు సహా పలువురి మృతి?

డమాస్కస్‌: సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయ కాన్సులర్‌ విభాగంపై ఇజ్రాయెల్‌ సోమవారం గగనతల దాడికి దిగింది. ఈ ఘటనలో ఆ విభాగం నేలమట్టమైపోగా అక్కడ ఉన్నవారంతా ప్రాణాలు కోల్పోవడమో, గాయపడడమో జరిగిందని సిరియా అధికార వార్తాసంస్థ తెలిపింది. ఈ దాడిలో ఇరాన్‌ సైనిక సలహాదారుడు.. జనరల్‌ అలీ రెజా జహ్దీ ప్రాణాలు కోల్పోయారని స్థానిక ప్రసార మాధ్యమాలు వెల్లడించాయి. దీనిని అధికారులు ధ్రువీకరించలేదు. దాడిలో పలువురు చనిపోయారని సిరియా విదేశాంగ మంత్రి ఫైసల్‌ మెక్‌దాద్‌ తెలిపారు. లెబనాన్‌, సిరియాల్లో 2016 వరకు ఇరాన్‌ ఖుద్స్‌ దళాలకు జహ్దీయే నేతృత్వం వహించారు. శిథిలాల్లో మృతదేహాల కోసం సహాయక బలగాలు అన్వేషిస్తున్నాయి. కనీసం ఆరుగురు చనిపోయి ఉంటారని బ్రిటన్‌ కేంద్రంగా ఉన్న ‘సిరియా మానవ హక్కుల సంస్థ’ అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని