ఇస్తాంబుల్‌ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం

తుర్కియే ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లో మంగళవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 29 మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.

Published : 03 Apr 2024 03:10 IST

29 మంది మృతి.. పలువురికి గాయాలు

ఇస్తాంబుల్‌: తుర్కియే ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లో మంగళవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 29 మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. నైట్‌క్లబ్‌లో ఆధునికీకరణ పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన ఎనిమిది మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని, బాధితులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు ముందు పునరుద్ధరణ పనుల కోసం నైట్‌క్లబ్‌ను మూసివేశారు. నైట్‌క్లబ్‌ 16 అంతస్తుల ఎత్తైన భవనంలో మొదటి అంతస్తులో ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని, బాధితులను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్‌ దావత్‌ గుల్‌ విలేకరులకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని