ఇజ్రాయెల్‌కు 60 మంది భారతీయ నిర్మాణ కార్మికులు

భవన నిర్మాణ పనుల్లో పాల్గొనేందుకు 60 మందితో కూడిన భారతీయ కార్మికుల తొలి బ్యాచ్‌ మంగళవారం ఇజ్రాయెల్‌కు బయలుదేరింది.

Published : 03 Apr 2024 04:36 IST

తొలి బ్యాచ్‌లో వెళ్లారని ఇజ్రాయెల్‌ రాయబారి వెల్లడి

దిల్లీ: భవన నిర్మాణ పనుల్లో పాల్గొనేందుకు 60 మందితో కూడిన భారతీయ కార్మికుల తొలి బ్యాచ్‌ మంగళవారం ఇజ్రాయెల్‌కు బయలుదేరింది. వీరికి దిల్లీలో వీడ్కోలు పలికామని మన దేశంలోని ఇజ్రాయెల్‌ రాయబారి నోర్‌ గిలోన్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా వెల్లడించారు. ఈ కార్మికులు రెండు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలను నెలకొల్పే దూతలవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌-భారత్‌ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా కార్మికులు వెళ్తున్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని