మధ్యంతర బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియాలోని కిమ్‌ సర్కారు వరుసగా క్షిపణి ప్రయోగ పరీక్షలు చేపడుతుండటంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.

Published : 03 Apr 2024 04:36 IST

సియోల్‌: ఉత్తర కొరియాలోని కిమ్‌ సర్కారు వరుసగా క్షిపణి ప్రయోగ పరీక్షలు చేపడుతుండటంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మంగళవారం ఈ దేశం అక్కడి తూర్పు జలాల్లో అనుమానాస్పద మధ్యంతర బాలిస్టిక్‌ క్షిపణిని  ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఆ దేశ రాజధాని ప్యాంగ్‌యాంగ్‌ సమీప ప్రాంతం నుంచే క్షిపణిని పరీక్షించిందని, అది ఎంత దూరం వెళ్లిందనేది ప్రస్తుతానికి తెలియరాలేదని పేర్కొంది. దక్షిణ కొరియా రాజధానిని లక్ష్యంగా చేసుకొని చేపట్టిన క్షిపణి ప్రయోగాన్ని కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గత నెల 18న ప్రత్యక్షంగా పర్యవేక్షించిన తర్వాత ఆ దేశం చేపట్టిన తొలి ప్రయోగం ఇది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని