బాల్టిమోర్‌ నౌకలోని భారతీయులు భద్రం

గతవారం అమెరికాలోని బాల్టిమోర్‌ వంతెనను ఢీకొన్న రవాణా నౌక ‘డాలి’లోని 21 మంది సిబ్బంది ఇప్పటికీ నౌకలోనే ఉండి విధులు నిర్వహిస్తున్నారనీ, దుర్ఘటనపై దర్యాప్తు పూర్తయ్యేంతవరకు వారు నౌకలోనే ఉంటారని నౌక యజమాని అయిన సింగపూర్‌ సంస్థ ప్రకటించింది.

Published : 03 Apr 2024 06:39 IST

న్యూయార్క్‌: గతవారం అమెరికాలోని బాల్టిమోర్‌ వంతెనను ఢీకొన్న రవాణా నౌక ‘డాలి’లోని 21 మంది సిబ్బంది ఇప్పటికీ నౌకలోనే ఉండి విధులు నిర్వహిస్తున్నారనీ, దుర్ఘటనపై దర్యాప్తు పూర్తయ్యేంతవరకు వారు నౌకలోనే ఉంటారని నౌక యజమాని అయిన సింగపూర్‌ సంస్థ ప్రకటించింది. బాల్టిమోర్‌ నుంచి కొలంబోకు వెళుతున్న ఈ రవాణా నౌక సిబ్బందిలో 20 మంది భారతీయులు కాగా, ఒకరు శ్రీలంకకు చెందినవారు. నౌకలోని భారతీయ సిబ్బంది క్షేమంగా ఉన్నారు. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం వారితోనూ, స్థానిక అధికారులతోనూ నిత్యం సంప్రదిస్తోంది. డాలి నౌక అదుపు తప్పిందని సిబ్బంది ముందుగానే తెలియజేయడంతో వంతెనపై రాకపోకలను నిలుపు చేయగలిగారనీ, ఇది ఎందరో ప్రాణాలను కాపాడిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ఆయన శుక్రవారం బాల్టిమోర్‌ను సందర్శించనున్నారు. నదిలో కూలిన వంతెన భాగాలను తొలగించి బాల్టిమోర్‌ రేవు నుంచి నౌకా రవాణా సాఫీగా జరగడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని