మేం ప్రయోగించింది హైపర్‌సోనిక్‌ క్షిపణి

ఉత్తరకొరియా మంగళవారం తాము పరీక్షించిన క్షిపణి వివరాలను వెల్లడించింది. ఘన ఇంధనంతో దూసుకెళ్లే మధ్యశ్రేణి హైపర్‌సోనిక్‌ క్షిపణిని ప్రయోగించామని తెలిపింది.

Published : 04 Apr 2024 05:00 IST

వివరాలు వెల్లడించిన ఉత్తరకొరియా

సియోల్‌: ఉత్తరకొరియా మంగళవారం తాము పరీక్షించిన క్షిపణి వివరాలను వెల్లడించింది. ఘన ఇంధనంతో దూసుకెళ్లే మధ్యశ్రేణి హైపర్‌సోనిక్‌ క్షిపణిని ప్రయోగించామని తెలిపింది. ఈ పరీక్షను అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ దగ్గరుండి పర్యవేక్షించారని పేర్కొంది. 101 కిలోమీటర్ల ఎత్తుకు క్షిపణి వెళ్లిందని, రాకెట్‌ లాంఛర్‌ నుంచి విడిపోయిన తర్వాత 1000 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లిందని వెల్లడించింది. దీన్ని దక్షిణకొరియా ఖండించింది. క్షిపణి కేవలం 600 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించిందని, సామర్థ్యాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నారని పేర్కొంది. ఈ ప్రయోగాన్ని దక్షిణ కొరియాతో పాటు.. జపాన్‌, అమెరికా ఖండించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని