ఇక చంద్రుడిపై టైం తెలుసుకోవచ్చు

అమెరికాలోనో.. బ్రిటన్‌లోనో ఇప్పుడు సమయం ఎంతైందో.. అని అప్పుడప్పుడు మనం తెలుసుకుంటుంటాం.

Published : 04 Apr 2024 04:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలోనో.. బ్రిటన్‌లోనో ఇప్పుడు సమయం ఎంతైందో.. అని అప్పుడప్పుడు మనం తెలుసుకుంటుంటాం. భవిష్యత్తులో చంద్రుడిపై టైం ఎంతైందో కూడా తెలుసుకోనున్నాం. జాబిల్లి, ఇతర గ్రహాలపై సమయం తెలుసుకునేలా ఓ ఏకీకృత ప్రామాణిక సమయాన్ని (యూఎస్‌టీ) నిర్ధారించాలని శ్వేతసౌధం భావిస్తోంది. ఇందుకోసం 2026 నాటికల్లా ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి ప్రణాళికను సిద్ధం చేయాలని నాసాను శ్వేతసౌధం ఆదేశించింది. ఈ సమయాన్ని ‘కోఆర్డినేటెడ్‌ లూనార్‌ టైం’ (సీఎల్‌టీ) అని పిలవనున్నారు. అంతరిక్షంలో ప్రయాణించాలనుకునే నౌకలకు, ఉపగ్రహాలకు కీలకమైన సమయపాలన ప్రమాణాన్ని ఇది అందించనుంది. గురుత్వాకర్షణ శక్తిలో తేడాల కారణంగా సమయ నిర్ధారణలో చోటుచేసుకునే మార్పులను ఈ సందర్భంగా అంచనా వేయాల్సి ఉంటుంది. సాధారణంగా భూమిపై పనిచేసే గడియారం చంద్రుడిపైకి చేరితే రోజుకు 58.7 మిల్లీ సెకన్లను కోల్పోతుందని శ్వేత సౌధంలోని ‘సైన్స్‌-టెక్నాలజీ విధానం’ అధిపతి ఆర్తి ప్రభాకర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని