నిర్బంధ సైనిక శిక్షణకు వయసును తగ్గించిన ఉక్రెయిన్‌

రష్యాతో పోరు ఫలితంగా సైనికుల సంఖ్య భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో ఉక్రెయిన్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 04 Apr 2024 04:48 IST

కీవ్‌: రష్యాతో పోరు ఫలితంగా సైనికుల సంఖ్య భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో ఉక్రెయిన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్బంధ సైనిక శిక్షణకు వయసును 27 నుంచి 25 ఏళ్లకు తగ్గించినట్లు బుధవారం వెల్లడించింది. ఈ బిల్లును ఆ దేశ పార్లమెంటు గత ఏడాదే ఆమోదించినప్పటికీ.. అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇప్పుడే దానిపై సంతకం చేశారు. ఎందుకు ఈ బిల్లును అమలులోకి తెచ్చారనే దానిపై అధ్యక్ష కార్యాలయం నుంచి ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. తాజా నిర్ణయంతో కొత్తగా ఎంతమంది సైన్యంలోకి వస్తారన్న దానిపైనా స్పష్టత లేదు. ఐదు లక్షల మంది సైనికులను సమీకరించుకోవాలని భావిస్తున్నట్లు గత డిసెంబరులో జెలెన్‌స్కీ ప్రకటించారు. ఇన్నాళ్లుగా యుద్ధక్షేత్రంలో పోరాడుతున్న సైనికులను మార్చడం, లేదా ఇంటికి వెళ్లేందుకు అనుమతించడం వంటి సున్నిత అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సైనికాధికారులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని