మొబైల్‌ యాప్‌తో ప్రాథమిక దశలోనే డెమెన్షియా గుర్తింపు!

మొబైల్‌ యాప్‌తో గొంతు, శరీర కదలికలు.. ఇతర అంశాలను రికార్డు చేసి ఆ డేటా ఆధారంగా ప్రారంభ దశలోనే డెమెన్షియా (తీవ్ర మతిమరుపు)ను గుర్తించవచ్చని తాజా అధ్యయనంలో యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో(యూసీఎస్‌ఎఫ్‌) పరిశోధకులు కనుగొన్నారు.

Published : 04 Apr 2024 04:59 IST

యూసీఎస్‌ఎఫ్‌ పరిశోధనలో వెల్లడి

దిల్లీ: మొబైల్‌ యాప్‌తో గొంతు, శరీర కదలికలు.. ఇతర అంశాలను రికార్డు చేసి ఆ డేటా ఆధారంగా ప్రారంభ దశలోనే డెమెన్షియా (తీవ్ర మతిమరుపు)ను గుర్తించవచ్చని తాజా అధ్యయనంలో యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో(యూసీఎస్‌ఎఫ్‌) పరిశోధకులు కనుగొన్నారు. ‘‘ఈ పరిశోధనకు 54 ఏళ్ల సగటు వయసున్న 360 మందిని తీసుకున్నాం. వారికి రకరకాల పరీక్షలు నిర్వహించాం. అవి నిర్వహిస్తుండగానే వారి మాటలను, కదలికలను రికార్డు చేశాం. వీటి ఆధారంగా జన్యుస్థాయిలోనే డిమెన్షియా లక్షణాలను గుర్తించగలిగాం’’ అని పరిశోధనలో పాల్గొన్న అడమ్‌ స్టెఫారోని తెలిపారు. ‘‘డెమెన్షియాను చాలా ఆలస్యంగా గుర్తిస్తాం. ఎందుకంటే చిన్న వయసులో లక్షణాలు కనిపించినా మానసిక సమస్యలుగానే భావిస్తాం. ఈ యాప్‌ సమాచారంతో ప్రాథమిక దశలోనే కచ్చితంగా లక్షణాలను గుర్తించే వీలుంటుంది’’ అని పేర్కొన్నారు. ఈ అధ్యయనాన్ని జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (జామా) నెట్‌వర్క్‌ ఓపెన్‌ ప్రచురించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని