మళ్లీ నిలిచిపోయిన రష్యా భారీ రాకెట్‌ ప్రయోగం

రష్యాకు చెందిన భారీ రాకెట్‌ ‘అంగార-ఎ5’ ప్రయోగం చివరి క్షణాల్లో వాయిదా పడింది. వోస్తోక్ని అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లాల్సింది.

Published : 11 Apr 2024 04:09 IST

మాస్కో: రష్యాకు చెందిన భారీ రాకెట్‌ ‘అంగార-ఎ5’ ప్రయోగం చివరి క్షణాల్లో వాయిదా పడింది. వోస్తోక్ని అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లాల్సింది. అయితే ప్రయోగ సమయానికి రెండు నిమిషాల ముందు ఈ ప్రయత్నాన్ని ఇంజినీర్లు విరమించుకున్నారు. రాకెట్‌ సెంట్రల్‌ బ్లాక్‌లోని ఆక్సిడైజర్‌ ట్యాంక్‌లో పీడన వ్యవస్థ విఫలం కావడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని