హెపటైటిస్‌ కేసుల్లో రెండో స్థానంలో భారత్‌

హెపటైటిస్‌-బి, సి కేసుల విషయంలో భారత్‌.. చైనా తర్వాత రెండో స్థానంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజా నివేదిక పేర్కొంది. 2022లో భారత్‌లో ఈ రుగ్మత బాధితులు 3.5 కోట్ల మంది ఉన్నారని తెలిపింది.

Updated : 11 Apr 2024 05:57 IST

జెనీవా: హెపటైటిస్‌-బి, సి కేసుల విషయంలో భారత్‌.. చైనా తర్వాత రెండో స్థానంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజా నివేదిక పేర్కొంది. 2022లో భారత్‌లో ఈ రుగ్మత బాధితులు 3.5 కోట్ల మంది ఉన్నారని తెలిపింది. కాలేయంలో ఇన్‌ఫ్లమేషన్‌ తలెత్తడం వల్ల హెపటైటిస్‌ వస్తుంది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అవి మరణానికీ దారితీయవచ్చు.

డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 2022లో 25.4 కోట్ల మంది హెపటైటిస్‌-బి, 5 కోట్ల మంది హెపటైటిస్‌-సి బాధితులు ఉన్నారు. చైనాలో ఈ రెండు రకాలు కలిసి 8.3 కోట్ల కేసులు వెలుగు చూశాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన హెపటైటిస్‌ కేసుల్లో ఇవి 27.5 శాతం. భారత్‌లో 2.98 కోట్ల హెపటైటిస్‌- బి కేసులు, 55 లక్షల హెపటైటిస్‌- సి ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా వెలుగుచూసిన కేసుల్లో ఇవి 11.6 శాతం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని