కెనడా సర్కారుకు షాకిచ్చిన కమిషన్‌

కెనడా దర్యాప్తు సంస్థలు ఆ దేశ అధ్యక్షుడు జస్టిన్‌ ట్రూడోకు షాకిచ్చాయి. అక్కడి ఎన్నికల్లో భారత్‌ జోక్యం చేసుకోలేదని వాటి దర్యాప్తులో తేటతెల్లమైనట్లు నివేదికను సమర్పించాయి.

Published : 11 Apr 2024 04:10 IST

దేశ ఎన్నికల్లో భారత ప్రమేయం లేదని స్పష్టీకరణ

ఇంటర్నెట్‌ డెస్క్‌: కెనడా దర్యాప్తు సంస్థలు ఆ దేశ అధ్యక్షుడు జస్టిన్‌ ట్రూడోకు షాకిచ్చాయి. అక్కడి ఎన్నికల్లో భారత్‌ జోక్యం చేసుకోలేదని వాటి దర్యాప్తులో తేటతెల్లమైనట్లు నివేదికను సమర్పించాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో భారత్‌, పాకిస్థాన్‌లు జోక్యం చేసుకున్నాయని ఆరోపిస్తూ ట్రూడో ప్రభుత్వం ఈ అంశంపై దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకోవడం మా విధానం కాదని కెనడా తీరును భారత్‌ ఇప్పటికే తీవ్రంగా ఖండించింది కూడా. ఈ ఆరోపణలపై కమిషన్‌ ఓ నివేదికను సమర్పించింది. ఎన్నికల్లో భారత్‌ ప్రమేయం లేదని అందులో స్పష్టం చేసింది. 2019-21 ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా యత్నించిందని కెనడియన్‌ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (సీఎస్‌ఐఎస్‌) నివేదిక వెల్లడించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని