ప్రధాని దిగాలని.. విమానాన్ని దారి మళ్లించారు

పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ దిగడం కోసం విమానాన్ని దారి మళ్లించడంతో వందల మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పాక్‌ సర్కారు.. ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టింది.

Updated : 11 Apr 2024 05:50 IST

పాకిస్థాన్‌లో ఘటన

లాహోర్‌: పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ దిగడం కోసం విమానాన్ని దారి మళ్లించడంతో వందల మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పాక్‌ సర్కారు.. ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ప్రధాని కూడా సామాన్య ప్రయాణికుల విమానంలోనే ప్రయాణిస్తున్నారు. ఇటీవల షెహబాజ్‌ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా.. ప్రధాని దిగడం కోసం ఇస్లామాబాద్‌ వెళ్లాల్సిన విమానాన్ని లాహోర్‌ వైపు దారి మళ్లించినట్లు పాక్‌ మీడియా కథనాలు పేర్కొన్నాయి. జెడ్డా నుంచి ఇస్లామాబాద్‌ వెళ్లే విమానంలో ప్రధాని, ఆయన బృందం ప్రయాణించింది. వీరితో పాటు విమానంలో మొత్తం 393 మంది ప్రయాణికులున్నారు. వాస్తవానికి ఈ విమానం సోమవారం రాత్రి 10.30 గంటలకు ఇస్లామాబాద్‌లో దిగాల్సిఉంది. అయితే, దాన్ని దారి మళ్లించడంతో రాత్రి 9.25 గంటలకే విమానం లాహోర్‌ విమానాశ్రయంలో దిగింది. అనంతరం రాత్రి 11.17 గంటలకు విమానం అసలైన గమ్యస్థానానికి చేరుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని