ఉక్రెయిన్‌కు ఇరానీ ఆయుధాలు

ఉక్రెయిన్‌కు సొంత నిల్వల నుంచి ఆయుధాలను సరఫరా చేయడానికి ఉద్దేశించిన బిల్లు ప్రతిపక్ష రిపబ్లికన్ల వ్యతిరేకత వల్ల పార్లమెంటు(కాంగ్రెస్‌)లో నిలిచిపోవడంతో డెమొక్రటిక్‌ పార్టీ ప్రభుత్వం కొత్త మార్గాలను తెరపైకి తెస్తోంది.

Published : 11 Apr 2024 04:11 IST

బైడెన్‌ ప్రభుత్వ నిర్ణయం

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌కు సొంత నిల్వల నుంచి ఆయుధాలను సరఫరా చేయడానికి ఉద్దేశించిన బిల్లు ప్రతిపక్ష రిపబ్లికన్ల వ్యతిరేకత వల్ల పార్లమెంటు(కాంగ్రెస్‌)లో నిలిచిపోవడంతో డెమొక్రటిక్‌ పార్టీ ప్రభుత్వం కొత్త మార్గాలను తెరపైకి తెస్తోంది. హూతీలు, ఇతర సాయుధ గ్రూపులకు ఇరాన్‌ పంపగా, మార్గమధ్యంలోనే పట్టుబడిన ఆయుధాలను ఉక్రెయిన్‌కు మళ్లించాలని నిర్ణయించింది. పట్టుబడినవాటిలో 10 లక్షల ఇరానియన్‌ తుపాకీ తూటాలను నిరుడు అక్టోబరులో ఉక్రెయిన్‌కు అందించారు. ఈ నెల 4న 5,000 ఏకె-47 రైఫిళ్లు, మెషీన్‌గన్లు, స్నైపర్‌ రైఫిళ్లు, ఆర్‌.పి.జి-7, 5 లక్షల రౌండ్ల తూటాలను ఉక్రెయిన్‌కు బదిలీ చేశారు.

రష్యా-చైనా భాయి భాయి

ఉక్రెయిన్‌పై దండయాత్ర విషయంలో పాశ్చాత్య దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో ఒకరికొకరు తోడుగా ఉన్నామని రష్యా, చైనాలు పేర్కొన్నాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మంగళవారం రష్యా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ సమావేశం సందర్భంగా ఈ అభిప్రాయమే ప్రధానంగా వ్యక్తమైంది.  చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వాంగ్‌ యీతో లవ్రోవ్‌ జరిపిన సమావేశంలో అంతర్జాతీయ వ్యవహారాల్లో సంఘటితంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని