నా పిల్లలను ఇజ్రాయెల్‌ కిరాతకంగా హత్య చేసింది

తీవ్ర పగ, ప్రతీకారాలతో తన ముగ్గురు పిల్లలను మరో ముగ్గురు మనవళ్లను ఇజ్రాయెల్‌ అత్యంత దారుణంగా హత్య చేసిందని హమాస్‌ కీలక నేత ఇస్మాయిల్‌ హనియా తెలిపారు.

Updated : 11 Apr 2024 05:55 IST

హమాస్‌ నేత ఇస్మాయిల్‌ హనియా

రఫా: తీవ్ర పగ, ప్రతీకారాలతో తన ముగ్గురు పిల్లలను మరో ముగ్గురు మనవళ్లను ఇజ్రాయెల్‌ అత్యంత దారుణంగా హత్య చేసిందని హమాస్‌ కీలక నేత ఇస్మాయిల్‌ హనియా తెలిపారు. చట్టాలను,  విలువలను ఏ మాత్రం పట్టించుకోలేదని అన్నారు. జెరూసలెం, అల్‌ అక్సా మసీదును విముక్తి చేసే మార్గంలో తన కుమారులు అమరులయ్యారని బుధవారం అల్‌ జజీరా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తన పిల్లలను హత్య చేసినంత మాత్రాన పాలస్తీనా విషయంలో తన వైఖరి మారదని అన్నారు. ఈయన కొన్నేళ్లుగా ఖతార్‌లో ప్రవాస జీవితం గడుపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని