కరాచీకి పోటెత్తిన భిక్షగాళ్లు

పాకిస్థాన్‌లోని కరాచీ నగరం రంజాన్‌ మాసంలో భిక్షగాళ్ల రాజధానిగా మారిపోయింది. దేశంలోని నలుమూలల నుంచి 3 లక్షల నుంచి 4 లక్షల మంది యాచకులు కరాచీ చేరుకున్నారని, దీంతో నగరంలో నేరాలు పెరిగాయనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Updated : 12 Apr 2024 06:07 IST

కరాచీ: పాకిస్థాన్‌లోని కరాచీ నగరం రంజాన్‌ మాసంలో భిక్షగాళ్ల రాజధానిగా మారిపోయింది. దేశంలోని నలుమూలల నుంచి 3 లక్షల నుంచి 4 లక్షల మంది యాచకులు కరాచీ చేరుకున్నారని, దీంతో నగరంలో నేరాలు పెరిగాయనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రంజాన్‌ మాసంలో కరాచీలోని ప్రతి కూడలిలో యాచకులు దర్శనమిస్తున్నారని, దీనికితోడు నగరంలో ఇటీవలి కాలంలో నేరాలు మరింతగా పెరిగాయని కరాచీ అదనపు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఇమ్రాన్‌ యకూబ్‌ మిన్హాస్‌ తెలిపారు. సింధ్‌, బలూచిస్థాన్‌, పాక్‌లోని నలుమూలల నుంచి యాచకులు భారీ సంఖ్యలో కరాచీకి తరలివచ్చారని పేర్కొన్నారు. పాత పద్ధతుల్లో నేరస్థులను పట్టుకోవడం కష్టసాధ్యమని, అందుకే ప్రతి కూడలిలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని