క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా

ఉక్రెయిన్‌పై రష్యా మరోమారు విరుచుకుపడింది. క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. దీంతో ఉక్రెయిన్‌లోని అతిపెద్ద విద్యుత్తు కర్మాగారాల్లో ఒకటి ధ్వంసమైంది.

Published : 12 Apr 2024 05:26 IST

ఉక్రెయిన్‌లోని అతిపెద్ద విద్యుత్తు కర్మాగారాల్లో ఒకటి ధ్వంసం

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా మరోమారు విరుచుకుపడింది. క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. దీంతో ఉక్రెయిన్‌లోని అతిపెద్ద విద్యుత్తు కర్మాగారాల్లో ఒకటి ధ్వంసమైంది. కీవ్‌, చెర్‌స్కే, జిప్టోమ్రీ రీజియన్లకు విద్యుత్తు సరఫరా చేస్తే ట్రిప్లిస్కా విద్యుత్తు కర్మాగారం దాడి కారణంగా పలుమార్లు స్తంభించింది. అనంతరం ట్రాన్స్‌ఫార్మర్లు, టర్బెయిన్లు, జనరేటర్లు ధ్వంసమయ్యాయి. తొలి డ్రోన్‌ వచ్చిన సమయంలో కర్మాగారంలోని ఉద్యోగులంతా ఓ చోట దాక్కున్నట్లు కర్మాగారాన్ని నిర్వహించే సంస్థ డైరెక్టర్‌ ఒకరు తెలిపారు. అనంతరం చూస్తుండగానే విద్యుత్తు కేంద్రంలో మంటలు చెలరేగాయని, అదో భయానక అనుభవమని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని