నిజ్జర్‌ హత్యను మళ్లీ ప్రస్తావించిన ట్రూడో

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తాజాగా మరోసారి ఖలిస్థానీ సిక్కు ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య ఉదంతాన్ని ప్రస్తావించారు.

Updated : 12 Apr 2024 05:52 IST

ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తాజాగా మరోసారి ఖలిస్థానీ సిక్కు ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య ఉదంతాన్ని ప్రస్తావించారు. కెనడా పౌరులందరి హక్కులు, స్వతంత్రతను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కెనడా ఎన్నికల్లో విదేశీ శక్తుల ప్రభావంపై ఆయన బుధవారం ఉన్నతస్థాయి విచారణ కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పై మేరకు పేర్కొంటూ గత ప్రభుత్వం భారత సర్కార్‌తో స్నేహపూర్వకంగా ఉండేదని ఆరోపించారు. గతేడాది జూన్‌ 18న సర్రేలోని గురుద్వారా సమీపంలో నిజ్జర్‌ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనలో భారత్‌ పాత్ర ఉందంటూ గత నవంబరులో ట్రూడో ఆరోపించారు. వాటిని అప్పట్లోనే భారత్‌ తీవ్రంగా ఖండించింది. అవి అసంబద్ధం, ప్రేరేపితమైనవని అభివర్ణించింది. ఆ నాటి నుంచి భారత్‌-కెనడాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని