రోదసిలోకి రష్యా సరికొత్త రాకెట్‌

చంద్రమండల యాత్రకు, గూఢచారి, కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల ప్రయోగానికి ఉద్దేశించిన భారీ రాకెట్‌ అంగార-ఏ5ను రష్యా గురువారం విజయవంతంగా కక్ష్యలోకి పంపింది.

Published : 12 Apr 2024 05:41 IST

మాస్కో: చంద్రమండల యాత్రకు, గూఢచారి, కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల ప్రయోగానికి ఉద్దేశించిన భారీ రాకెట్‌ అంగార-ఏ5ను రష్యా గురువారం విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. మంగళ, బుధవారాల్లో ఈ రాకెట్‌ ప్రయోగం సాంకేతిక సమస్యల వల్ల వాయిదాపడింది. గురువారం ముచ్చటగా మూడోసారి విజయవంతమై నింగికి ఎగసింది. ఇది సోవియట్‌ కాలంనాటి ప్రోటాన్‌ రాకెట్‌కు ఆధునిక రూపం. కొత్తగా నిర్మించిన వోస్తోక్నీ అంతరిక్ష కేంద్రం నుంచి అంగారను ప్రయోగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని