నగ్నచిత్రాలు పంపితే ‘బ్లర్‌’ అవుతాయి

లైంగిక దోపిడీపై పోరాటానికి, యువత రక్షణ కోసం తాము కొత్త టూల్‌ను ప్రవేశడుతున్నామని సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌ గురువారం ప్రకటించింది.

Published : 12 Apr 2024 06:02 IST

కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌
లైంగిక దోపిడీపై పోరు, టీనేజర్ల రక్షణ కోసమే..

లండన్‌: లైంగిక దోపిడీపై పోరాటానికి, యువత రక్షణ కోసం తాము కొత్త టూల్‌ను ప్రవేశడుతున్నామని సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌ గురువారం ప్రకటించింది. డైరెక్ట్‌ మెసేజ్‌ కింద నగ్న చిత్రాలను పంపిన సమయంలో ఈ టూల్‌ వాటిని ఆటోమెటిక్‌గా బ్లర్‌ చేస్తుందని వెల్లడించింది. లైంగిక కుంభకోణాలు, ఇతర మార్గాల్లోని చిత్రాల దుర్వినియోగంపై ప్రచారంలో భాగంగా తాము కొత్త ఫీచర్లను పరీక్షిస్తున్నామని, టీనేజ్‌ వారిని నేరస్థులు సంప్రదించడం కఠినతరం చేస్తున్నామని వెల్లడించింది. లైంగిక దోపిడీలో భాగంగా నేరస్థులు డైరెక్ట్‌ మెసేజ్‌ మార్గంలో నగ్నచిత్రాలు పంపేలా అవతలి వారిని ఒప్పిస్తారు. అనంతరం డబ్బులు ఇవ్వకుంటే లేదా లైంగిక పరమైన అంశాల్లో తాము చెప్పినట్లు వినకుంటే వాటిని ఆన్‌లైన్‌లో ఉంచుతామని బెదిరిస్తారు. స్కామర్లు చాలా సందర్భాల్లో ‘సన్నిహిత చిత్రాలు’ పొందేందుకు డైరెక్ట్‌ మెసేజ్‌ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని, అయితే డైరెక్ట్‌ మెసేజ్‌ నగ్నత్వ రక్షణ సదుపాయాన్ని తాము పరీక్షిస్తున్నామని ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది. ఎవరైనా డైరెక్ట్‌ మెసేజ్‌లో నగ్న చిత్రాలను పంపితే ఈ ఫీచర్‌ వాటిని బ్లర్‌ చేస్తుందని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని