బ్రిటన్‌లో 12 మంది భారతీయుల అరెస్టు

బ్రిటన్‌లో 12 మంది భారతీయులను ఇమ్మిగ్రేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 12 Apr 2024 05:35 IST

వీసా నిబంధనల ఉల్లంఘనే కారణం

లండన్‌: బ్రిటన్‌లో 12 మంది భారతీయులను ఇమ్మిగ్రేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీసా నిబంధనల ఉల్లంఘన, చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు చేస్తున్నారనే కారణంతో వీరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితులº్ల 11 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నారు. అక్రమంగా పనిచేస్తున్న ఏడుగురు భారతీయుల్ని.. వీసా నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో మరో నలుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మహిళను సైతం వలస నేరాల ఆధారంగానే అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అరెస్టయిన 11 మంది పురుషుల్లో ఏడుగురు పరుపుల తయారీ కర్మాగారంలో, నలుగురు కేక్‌లు తయారుచేసే కర్మాగారంలో పనిచేస్తున్నారు. మహిళ ఓ ఇంట్లో పనిచేస్తున్నారు. నిందితుల్లో ఎనిమిది మందికి షరతులతో కూడిన బెయిల్‌ ఇవ్వగా మరో నలుగురిని భారత్‌కు పంపించడంపై చర్చిస్తున్నామని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని