ఆ దేశాల్లో కోరింత దగ్గు కలవరం

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోరింత దగ్గు కలవరపెడుతోంది. చైనా, ఫిలిప్పీన్స్‌, చెక్‌ రిపబ్లిక్‌తోపాటు నెదర్లాండ్స్‌లో అనేక మరణాలు నమోదవుతున్నాయి.

Published : 12 Apr 2024 05:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోరింత దగ్గు కలవరపెడుతోంది. చైనా, ఫిలిప్పీన్స్‌, చెక్‌ రిపబ్లిక్‌తోపాటు నెదర్లాండ్స్‌లో అనేక మరణాలు నమోదవుతున్నాయి. ఫిలిప్పీన్స్‌లో మూడు నెలల్లో 54 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియాల్లోనూ ఈ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఫిలిప్పీన్స్‌లో ఈ ఏడాది మూడు నెలల్లోనే సుమారు వెయ్యి కోరింత దగ్గు కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే వీటి సంఖ్య 34 రెట్లు పెరిగింది. చైనాలో ఈ ఏడాది తొలి రెండు నెలల్లో 32వేల కేసులు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అవి 20 రెట్లు అధికం. బ్రిటన్‌లో  జనవరిలోనే 553 కేసులు నమోదయ్యాయి. దాంతో వ్యాక్సిన్‌ తీసుకోవడంలో చిన్నారులు, గర్భిణులు నిర్లక్ష్యం వహించొద్దని స్థానిక ప్రభుత్వం ఇటీవల హెచ్చరించింది. ఆస్ట్రేలియాలోనూ గత మూడు నెలల్లో 2,799 కోరింత దగ్గు కేసులు రికార్డయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని