భారత్‌లో మరింతగా తగ్గిన కెనడా సిబ్బంది సంఖ్య

భారత్‌లో తమ దేశం తరఫున పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను కెనడా మరింతగా తగ్గించింది. పదుల సంఖ్యలో ఉద్యోగులను ఇక్కణ్నుంచి ఉపసంహరించుకుంది.

Published : 13 Apr 2024 04:40 IST

దిల్లీ: భారత్‌లో తమ దేశం తరఫున పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను కెనడా మరింతగా తగ్గించింది. పదుల సంఖ్యలో ఉద్యోగులను ఇక్కణ్నుంచి ఉపసంహరించుకుంది. మన దేశంలోని కెనడా హైకమిషన్‌ అధికార ప్రతినిధి శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌ వ్యాప్తంగా కెనడా వీసా దరఖాస్తు కేంద్రాల కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. బ్రిటిష్‌ కొలంబియాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో గత సెప్టెంబరులో ఆరోపించారు. ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. భారత్‌లో దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కెనడాకు సూచించింది. దాంతో 41 మంది దౌత్యవేత్తలు, వారి కుటుంబసభ్యులను ఆ దేశం ఉపసంహరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని