ఖండాంతర క్షిపణిని పరీక్షించిన రష్యా

విజయవంతంగా ఒక ఖండాంతర క్షిపణిని ప్రయోగించినట్లు రష్యా సైన్యం శుక్రవారం ప్రకటించింది. దేశ దక్షిణ భాగంలోని కపుస్తిన్‌ యార్‌ పరీక్ష కేంద్రంలో ఈ ప్రయోగం జరిగినట్లు తెలిపింది.

Published : 13 Apr 2024 05:47 IST

మాస్కో: విజయవంతంగా ఒక ఖండాంతర క్షిపణిని ప్రయోగించినట్లు రష్యా సైన్యం శుక్రవారం ప్రకటించింది. దేశ దక్షిణ భాగంలోని కపుస్తిన్‌ యార్‌ పరీక్ష కేంద్రంలో ఈ ప్రయోగం జరిగినట్లు తెలిపింది. సర్వీసులో ఉన్న క్షిపణుల సామర్థ్యాన్ని ధ్రువీకరించుకోవడంలో భాగంగా ఈ కసరత్తు చేపట్టినట్లు వివరించింది. పరీక్ష లక్ష్యాలన్నీ నెరవేరాయని, రష్యా వ్యూహాత్మక భద్రతను కాపాడటంలో క్షిపణుల విశ్వసనీయతను ఇది చాటిందని తెలిపింది. తాజాగా పరీక్షించిన క్షిపణి పేరును మాత్రం అధికారులు వెల్లడించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని