అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా సంయుక్త విన్యాసాలు

వివాదాస్పద తూర్పు చైనా సముద్ర జలాల్లో అమెరికా, జపాన్‌, దక్షిణకొరియాలు ఈ నెల 10 నుంచి 12 వరకూ సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి.

Published : 13 Apr 2024 05:49 IST

వివాదాస్పద తూర్పు చైనా జలాల్లో బల ప్రదర్శన

వాషింగ్టన్‌: వివాదాస్పద తూర్పు చైనా సముద్ర జలాల్లో అమెరికా, జపాన్‌, దక్షిణకొరియాలు ఈ నెల 10 నుంచి 12 వరకూ సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి. జపాన్‌ ప్రధాని ఫుమియొ కిషిద, ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు ఫెర్డినాడ్‌ మార్కోస్‌ జూనియర్‌లతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వైట్‌హౌస్‌లో సమావేశమైన సమయంలోనే ఈ విన్యాసాలు జరగడం గమనార్హం. ఈ జలాల్లో చైనా దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా, మిత్ర దేశాలు.. తమ సైనిక సామర్థ్యాన్ని ప్రకటించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ విన్యాసాల్లో అమెరికా విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ థియోడర్‌ రూజ్‌వెల్ట్‌తోపాటు ఆ దేశానికి చెందిన క్షిపణి విధ్వంసక నౌకలు, జపాన్‌, దక్షిణ కొరియా యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. జలాంతర్గాములపై దాడి చేసే ఆయుధ వ్యవస్థల ప్రదర్శన, సముద్ర మార్గంలో ఆయుధాల రవాణాను అడ్డుకొనే ప్రక్రియను సాధన చేశాయి. ఈ పరిణామాలపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జపాన్‌ ప్రతికూల చర్యలు తమను అసహనానికి గురి చేస్తున్నాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని