60% ప్లాస్టిక్‌ కాలుష్యానికి 12 దేశాలే కారణం

శుద్ధిచేసి పునర్వినియోనికి వీలుగా మార్చకపోవడం వల్ల ప్లాస్టిక్‌ చెత్త కొండలుగా పేరుకుపోతోంది. ఇలాంటి అధ్వాన నిర్వహణ వల్ల ప్రపంచంలో పెరిగిపోయిన ప్లాస్టిక్‌ కాలుష్యంలో 60 శాతానికి 12 దేశాలే కారణమని స్విట్జర్లాండ్‌కు చెందిన ‘ఈఏ ఎర్త్‌ యాక్షన్‌’ సంస్థ వెల్లడించింది.

Updated : 13 Apr 2024 06:09 IST

దిల్లీ: శుద్ధిచేసి పునర్వినియోనికి వీలుగా మార్చకపోవడం వల్ల ప్లాస్టిక్‌ చెత్త కొండలుగా పేరుకుపోతోంది. ఇలాంటి అధ్వాన నిర్వహణ వల్ల ప్రపంచంలో పెరిగిపోయిన ప్లాస్టిక్‌ కాలుష్యంలో 60 శాతానికి 12 దేశాలే కారణమని స్విట్జర్లాండ్‌కు చెందిన ‘ఈఏ ఎర్త్‌ యాక్షన్‌’ సంస్థ వెల్లడించింది. ఆ 12 దేశాల జాబితాలో అమెరికా, చైనా, భారత్‌, రష్యా, బ్రెజిల్‌, మెక్సికో, పాకిస్థాన్‌, ఇరాన్‌, ఈజిప్ట్‌, ఇండోనేసియా, తుర్కియే, వియత్నాం ఉన్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఏటా శుద్ధి చేయని తలసరి ప్లాస్టిక్‌ వ్యర్థాలు 8 కిలోలు మాత్రమే. ఇది అమెరికా వ్యర్థాలలో మూడో వంతు, చైనా వ్యర్థాలలో అయిదో వంతు కన్నా తక్కువ. భారత్‌లో శుద్ధి చేయకుండా వదిలేసే ప్లాస్టిక్‌ వ్యర్థాలు 2024లో 74 లక్షల టన్నులకు చేరతాయని అంచనా. ప్రపంచంలో ఈ ఏడాది 22 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉత్పన్నం కాగా, అందులో 7 కోట్ల టన్నులను శుద్ధి చేయకుండా వదిలేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతోంది. ప్లాస్టిక్‌ కాలుష్య నివారణను చట్టపరమైన బాధ్యతగా నిర్వచించాలని ప్రపంచ నాయకులు భావిస్తున్నారు. ఈ అంశంపై కెనడాలోని ఒట్టావాలో ఐక్యరాజ్యసమితి అనుబంధ కమిటీ త్వరలో సమావేశమవుతుంది. దానికి ముందే స్విస్‌ సంస్థ నివేదిక విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని