రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లో 10 మంది మృతి

రష్యా ఆక్రమణలో ఉన్న దక్షిణ జపోరిజియా ప్రాంతంపై ఉక్రెయిన్‌ సేనలు జరిపిన ఫిరంగి గుండ్ల దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

Published : 14 Apr 2024 03:43 IST

కీవ్‌: రష్యా ఆక్రమణలో ఉన్న దక్షిణ జపోరిజియా ప్రాంతంపై ఉక్రెయిన్‌ సేనలు జరిపిన ఫిరంగి గుండ్ల దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పిల్లలు కూడా ఉన్నట్లు రష్యా నియమించిన అధికారి ఒకరు తెలిపారు. శుక్రవారం సాయంత్రం మూడు అపార్ట్‌మెంట్లపై ఈ దాడి జరిగింది. శిథిలాల నుంచి అయిదుగురిని సజీవంగా బయటకు తీసుకురాగలిగారు. 13మంది గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. శనివారం గాలింపు చర్యలు కొనసాగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు