వయోమింగ్‌ కాకసెస్‌లో బైడెన్‌ విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్‌ పార్టీ తరఫున నామినేషన్‌ కోసం జరుగుతున్న పోరులో అధ్యక్షుడు జో బైడెన్‌ మరో రాష్ట్రంలో విజేతగా నిలిచారు.

Published : 14 Apr 2024 03:43 IST

జూనో: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్‌ పార్టీ తరఫున నామినేషన్‌ కోసం జరుగుతున్న పోరులో అధ్యక్షుడు జో బైడెన్‌ మరో రాష్ట్రంలో విజేతగా నిలిచారు. వయోమింగ్‌ కాకసెస్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. ఆదివారం అలస్కాలో బైడెన్‌ను మూజువాణి ఓటుతో ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఆయనకు పోటీగా ఎవరూ బరిలో లేరు. వయోమింగ్‌, అలస్కా.. అమెరికాలో అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని