భారీ బల్లకట్ల విధ్వంసం.. అమెరికాలో వంతెన మూసివేత

నదిలో ఒక్కసారిగా వచ్చిన వరదతో కట్టుతప్పిన భారీ బల్లకట్లు విధ్వంసం సృష్టించాయి. అవి వరదలో దిగువకు వేగంగా ప్రయాణించడంతో నదిపై వంతెనను మూసివేయాల్సి వచ్చింది.

Published : 14 Apr 2024 03:43 IST

పిట్స్‌బర్గ్‌: నదిలో ఒక్కసారిగా వచ్చిన వరదతో కట్టుతప్పిన భారీ బల్లకట్లు విధ్వంసం సృష్టించాయి. అవి వరదలో దిగువకు వేగంగా ప్రయాణించడంతో నదిపై వంతెనను మూసివేయాల్సి వచ్చింది. పిట్స్‌బర్గ్‌లోని ఒహాయో నదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి 11.25 గంటల సమయంలో పిట్స్‌బర్గ్‌ పోలీసులకు.. బల్లకట్లు కట్టుతప్పి వేగంగా నదిలో ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో సమీపంలోని వంతెనను అధికారులు మూసివేశారు. ఆ బల్లకట్లు నదీ తీరంలోకి చేరుకోవడమో.. వరదలో కొట్టుకుపోవడమో పూర్తయ్యే వరకు దానిని మూసి ఉంచారు.  మొత్తం 26 బల్లకట్లు వంతెన సమీపంలో కట్టుతప్పి వరదలో వేగంగా ప్రయాణించాయని కోస్టుగార్డు కమాండర్‌ జస్టిన్‌ జోలీ తెలిపారు. అందులో 11 ఒకవైపు వెళ్లి ఆగిపోయాయని, మరొకటి వరదలో దిగువకు వెళ్లిందని, తొమ్మిదింటిని డ్యాం లాకులవద్ద స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, వంతెనలకు, డ్యాంకు నష్టం కలగలేదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని