వెస్ట్‌బ్యాంక్‌పై కొనసాగుతున్న సెటిలర్ల దాడులు

వెస్ట్‌బ్యాంకులో ఓ ఇజ్రాయెలీ సెటిలర్‌ 14 ఏళ్ల బాలుడి అదృశ్యం నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలింకా చల్లారలేదు.

Published : 14 Apr 2024 03:44 IST

ఉగ్రదాడిలో ఇజ్రాయెల్‌ బాలుడి మృతి

అల్‌ ముయ్యర్‌ (వెస్ట్‌బ్యాంక్‌): వెస్ట్‌బ్యాంకులో ఓ ఇజ్రాయెలీ సెటిలర్‌ 14 ఏళ్ల బాలుడి అదృశ్యం నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలింకా చల్లారలేదు. పాలస్తీనా ప్రాంతాలపై సెటిలర్ల దాడులు కొనసాగుతున్నాయి. బాలుడి కోసం వెతుకుతూ శుక్రవారం అల్‌ ముయ్యర్‌ గ్రామంపై ఇజ్రాయెలీలు చేసిన దాడిలో ఓ పాలస్తీనా యువకుడు మృతి చెందారు. 25 మందికి గాయాలయ్యాయి. శనివారం కూడా రమల్లా సమీపంలోని గ్రామాలపై సెటిలర్లు దాడులు చేశారు. అల్‌ ముయ్యర్‌ గ్రామంపై మరోసారి విరుచుకుపడి 12 గృహాలను, భారీ సంఖ్యలో కార్లను తగలబెట్టారు. ముగ్గురు గ్రామస్థులకు గాయాలైనట్లు పాలస్తీనా అథారిటీ తెలిపింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోయావ్‌ గలాంట్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు అదృశ్యమైన 14 ఏళ్ల బాలుడు శవమై కనిపించాడు. ఉగ్రవాదుల దాడిలో ఆ బాలుడు మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని