పాక్‌లో మరో ఉగ్రదాడి

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. క్వెట్టా నుంచి తాఫ్తాన్‌ వెళ్లే జాతీయ రహదారిపై రెండు చోట్ల దాడులు చేసి 11మందిని పొట్టనబెట్టుకున్నారు.

Published : 14 Apr 2024 05:13 IST

11 మంది పౌరుల మృతి 
ఇద్దరికి తీవ్ర గాయాలు

కరాచీ: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. క్వెట్టా నుంచి తాఫ్తాన్‌ వెళ్లే జాతీయ రహదారిపై రెండు చోట్ల దాడులు చేసి 11మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు శనివారం అధికారులు తెలిపారు. జాతీయ రహదారిపై వెళుతున్న ఓ బస్సును ఆపిన 10-12 మంది ముష్కరులు ప్రయాణికుల గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన తొమ్మిది మందిని కిడ్నాప్‌ చేశారు. తర్వాత వారిని హతమార్చారు. ఆ మృతదేహాలను సమీపంలోని ఓ వంతెన వద్ద గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మరో ఘటనలో అదే రహదారిపై వెళుతున్న కారుపై మిలిటెంట్లు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు