తుర్కియేలో కేబుల్‌ కార్‌ ప్రమాదం

దక్షిణ తుర్కియేలోని అంటాల్యా వెలుపల పర్వతంపై శుక్రవారం ఓ కేబుల్‌ కార్‌ స్తంభాన్ని ఢీకొని ధ్వంసమవడంతో  పర్యాటకుల్లో ఒకరు మృతి చెందారు.

Published : 14 Apr 2024 05:16 IST

ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు
174 మందిని రక్షించిన సహాయక సిబ్బంది

ఇస్తాంబుల్‌: దక్షిణ తుర్కియేలోని అంటాల్యా వెలుపల పర్వతంపై శుక్రవారం ఓ కేబుల్‌ కార్‌ స్తంభాన్ని ఢీకొని ధ్వంసమవడంతో  పర్యాటకుల్లో ఒకరు మృతి చెందారు. ఏడుగురు గాయపడ్డారు. పవిత్ర రంజాన్‌ని పురస్కరించుకుని పౌరులు కేబుల్‌ కార్లలో విహరిస్తుండగా శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ప్రమాదం సంభవించింది. దీంతో 16 కేబుల్‌ కార్లు గాల్లోనే నిలిచిపోగా.. వాటిలో సుమారు 174 మంది పౌరులు చిక్కుకున్నారు. సహాయక సిబ్బంది శుక్రవారం రాత్రంతా శ్రమించి 128 మందిని కాపాడారు. శనివారం 46 మందిని సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. దీంతో మొత్తం 23 గంటలపాటు సహాయక చర్యలు కొనసాగినట్లైంది. మొత్తం 607 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని, 10 హెలికాప్టర్లను వినియోగించామని తుర్కియే అత్యవసర స్పందన సంస్థ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు