కెన్యాలో భారీ వర్షాలు.. 13 మంది మృతి

కెన్యాలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 13మంది మృతిచెందారు.

Published : 14 Apr 2024 05:15 IST

15 వేల మంది నిరాశ్రయులు

నైరోబీ: కెన్యాలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 13మంది మృతిచెందారు. సుమారు 15వేల మంది నిరాశ్రయులయ్యారు. ఉత్తర కెన్యాలోని గరిస్సా రోడ్డు సహా అయిదు ప్రధాన రహదారులు వరదల కారణంగా దెబ్బతిన్నాయని కెన్యా రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. 51మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు కొట్టుకుపోగా.. అందరినీ రక్షించినట్లు పేర్కొన్నారు. తానా నదికి దిగువన ఉన్న స్థానికులు ఎగువ ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఈ నెలాఖరు నాటికి వర్షాలు కురవడం పతాకస్థాయికి చేరుతుందని, అనంతరం జూన్‌ నాటికి తగ్గుతాయని కెన్యా వాతావరణ విభాగం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు