సరబ్‌జీత్‌ సింగ్‌ హంతకుడి హత్య

పాకిస్థాన్‌లో మరణశిక్ష పడిన భారత ఖైదీ సరబ్‌జీత్‌ సింగ్‌ హత్య కేసు నిందితుడు అమీర్‌ సర్ఫరాజ్‌ తాంబా హత్యకు గురయ్యాడు.

Published : 15 Apr 2024 04:53 IST

లాహోర్‌లో ఆగంతుకుడి కాల్పుల్లో మృతిచెందిన అమీర్‌

దిల్లీ: పాకిస్థాన్‌లో మరణశిక్ష పడిన భారత ఖైదీ సరబ్‌జీత్‌ సింగ్‌ హత్య కేసు నిందితుడు అమీర్‌ సర్ఫరాజ్‌ తాంబా హత్యకు గురయ్యాడు. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌కు సన్నిహితుడైన అమీర్‌ను ఆదివారం లాహోర్‌లో గుర్తుతెలియని సాయుధులు కాల్చి చంపార[ని అధికారవర్గాలు తెలిపాయి. లాహోర్‌లోని ఇస్లాంపుర ప్రాంతంలో మోటార్‌సైకిళ్లపై వచ్చిన దుండగులు తాంబాపై కాల్పులు జరిపారు. అనంతరం అతడిని ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అత్యంత భద్రత ఉండే కోట్‌ లఖ్‌పత్‌ జైల్లో సరబ్‌జీత్‌పై తాంబా సహా పలువురు ఖైదీలు ఇటుకటు, ఇనుపకడ్డీలతో దాడి చేశారు. అనంతరం లాహోర్‌లోని జిన్నా ఆసుపత్రిలో చేర్పించగా, అక్కడ వారం రోజులపాటు అపస్మారక స్థితిలో మృత్యువుతో పోరాడిన అతను మే 2, 2013న గుండెపోటుతో మరణించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని