అఫ్గానిస్థాన్‌లో వరదలు.. 33 మంది మృతి

వరదల కారణంగా అఫ్గానిస్థాన్‌ అతలాకుతలమవుతోంది. గడిచిన మూడు రోజుల్లోనే అక్కడ 33 మంది చనిపోగా, 27మంది గాయపడ్డారు.

Published : 16 Apr 2024 04:45 IST

ఇస్లామాబాద్‌: వరదల కారణంగా అఫ్గానిస్థాన్‌ అతలాకుతలమవుతోంది. గడిచిన మూడు రోజుల్లోనే అక్కడ 33 మంది చనిపోగా, 27మంది గాయపడ్డారు. 600కు పైగా గృహాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 200 పశువులు మరణించాయని తాలిబన్‌ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఫరా, హెరాత్‌, జాబుల్‌, కాందహార్‌ ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయని పేర్కొన్నారు.

టాంజానియాలో 58 మంది..

తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాలో వరదల కారణంగా గత రెండు వారాల్లో 58 మంది మృతిచెందారు. తీరప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయని, 1.26 లక్షల మందికి పైగా ప్రజలు ఇబ్బందులు పడ్డారని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. భవిష్యత్తులో వరదలను నివారించేందుకు కొత్తగా 14 డ్యాంలను నిర్మించే ఆలోచనలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని