ఆస్ట్రేలియాలో మరో కత్తిదాడి

ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెస్ట్‌ఫీల్డ్‌ షాపింగ్‌ మాల్‌లో ఆరుగురిని బలితీసుకున్న కత్తిదాడిని మరవకముందే నగరంలో మరో ఘటన చోటుచేసుకుంది.

Published : 16 Apr 2024 04:47 IST

చర్చిలో బిషప్‌పై హత్యాయత్నం

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెస్ట్‌ఫీల్డ్‌ షాపింగ్‌ మాల్‌లో ఆరుగురిని బలితీసుకున్న కత్తిదాడిని మరవకముందే నగరంలో మరో ఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం సబర్బన్‌ వెక్లిలోని ‘క్రీస్ట్‌ ది గుడ్‌ షెపర్డ్‌’ చర్చిలో సేవలు అందిస్తున్న ఓ బిషప్‌పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడిచేశాడు. తల, శరీరం పైభాగంలో పదేపదే పొడిచి గాయపరిచాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో భయభ్రంతులైన చర్చిలోని వారంతా కేకలు వేస్తూ బిషప్‌కు సాయంగా వెళ్లడం ఓ వీడియోలో కనిపించింది. దాడిలో బిషప్‌తోపాటు మరో ముగ్గురు గాయపడ్డారని... వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. బిషప్‌ను సి మేరీ ఇమ్యాన్యుయెల్‌గా చర్చి ప్రకటించింది. కాగా ఎల్జీబీటీక్యూ సంఘానికి వ్యతిరేకంగా బిషప్‌ చేసిన ఓ ప్రసంగాన్ని గతేడాది మేలో ఓ ప్రముఖ మీడియా సంస్థ పోస్టు చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని