అనుమతి లేకుండా అశ్లీల డీప్‌ఫేక్‌ చిత్రాలు సృష్టించడం నేరమే: బ్రిటన్‌

వ్యక్తుల అనుమతి లేకుండా, వారి అశ్లీల చిత్రాలను డీప్‌ఫేక్‌ విధానంలో సృష్టించడాన్ని నేరంగా పరిగణించనున్నట్లు బ్రిటన్‌ ప్రకటించింది. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

Published : 17 Apr 2024 04:53 IST

లండన్‌: వ్యక్తుల అనుమతి లేకుండా, వారి అశ్లీల చిత్రాలను డీప్‌ఫేక్‌ విధానంలో సృష్టించడాన్ని నేరంగా పరిగణించనున్నట్లు బ్రిటన్‌ ప్రకటించింది. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి, వ్యక్తుల అశ్లీల చిత్రాలను డీప్‌ఫేక్‌ విధానంలో రూపొందించేవారిపై క్రిమినల్‌ రికార్డులు తెరుస్తామని, భారీ జరిమానాలు కూడా విధిస్తామని తెలిపింది. ఒకవేళ సంబంధిత చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందితే.. వాటి సృష్టికర్తలను జైలుకు పంపేందుకూ కొత్త చట్టం వీలు కల్పిస్తుందని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని