యూఏఈని ముంచెత్తిన భారీ వర్షాలు

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన వానలకు ప్రధాన రహదారులు, వీధుల్లోకి నీరు చేరింది. దుబాయ్‌ వ్యాప్తంగా రోడ్లపైన వాహనాలు చిక్కుకుపోయాయి.

Updated : 17 Apr 2024 06:00 IST

ఒమన్‌లో 18కి చేరిన మృతుల సంఖ్య

దుబాయ్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన వానలకు ప్రధాన రహదారులు, వీధుల్లోకి నీరు చేరింది. దుబాయ్‌ వ్యాప్తంగా రోడ్లపైన వాహనాలు చిక్కుకుపోయాయి. తీవ్ర గాలుల తాకిడికి.. నిత్యం రద్దీగా ఉండే దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేశారు. చాలా మంది కార్మికులు ఇళ్ల వద్దనే ఉండిపోయారు. వీధుల్లోని, రహదారుల్లోని నీటిని తోడడానికి అధికారులు ట్యాంకర్లను పంపించారు. మరోవైపు పొరుగునున్న ఒమన్‌లో కురిసిన భారీ వర్షాలకు మృతుల సంఖ్య 18కు చేరగా.. మరికొందరి ఆచూకీ ఇంకా తెలియరాలేదని ఆ దేశ అత్యవసర నిర్వహణ కమిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. బహ్రెయిన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా దేశాల్లోనూ వానలు పడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని